ప్రభాస్ ప్రోమోకి “అన్ స్టాప్పబుల్” రెస్పాన్స్.!

ప్రభాస్ ప్రోమోకి “అన్ స్టాప్పబుల్” రెస్పాన్స్.!

Published on Dec 14, 2022 2:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ లలో బిజీగా ఉంటూనే మరోపక్క అయితే ప్రభాస్ తన ఫస్ట్ ఓటిటి ఎంట్రీ ని నందమూరి నటసింహం ఆహా యాప్ లో చేస్తున్న సెన్సేషనల్ హిట్ టాక్ షో “అన్ స్టాప్పబుల్” సీజన్ 2 లో మొట్ట మొదటి సరిగా డార్లింగ్ తనదైన ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు.

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ని చాలా ఊరిస్తూ వస్తున్న ఈ క్రేజీ ఎపిసోడ్ ప్రోమో నిన్ననే బయటకి రాగా దానికి సోషల్ మీడియాలో సహా యూట్యూబ్ లో కూడా అన్ స్టాప్పబుల్ రెస్పాన్స్ దీనికి వస్తుంది. మరి ఎప్పుడో 12 గంటల్లోపే 1 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసేసిన ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానానికి వచ్చేసి రూల్ చేస్తుంది. మరి దీనితో ఈ విషయాన్నీ స్ట్రీమింగ్ యాప్ ఆహ వారు కూడా తెలిపి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ ఎపిసోడ్ ని అయితే మేకర్స్ ఓ స్పెషల్ డే కి స్ట్రీమింగ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు