లైగర్‌తో బాలయ్య బాక్సింగ్.. ప్రోమో మామూలుగా లేదండోయ్..!

Published on Jan 11, 2022 12:35 am IST

నందమూరి బాలకృష్ణ ఆహాలో వచ్చే “అన్‌స్టాపబుల్” షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్లతో బాలయ్య చేస్తున్న సందడి ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఎపిసోడ్ ఎపిసోడ్‌పై రెట్టింపు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఈ సంక్రాంతికి లైగర్ టీమ్ తో కలిసి బాలయ్య అల్లరి చేయబోతున్నాడు. జనవరి 14న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్‌కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీలు అతిథులుగా వచ్చారు.

అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య మరీ రెచ్చిపోయాడు. పూరి జగన్నాథ్‌ని కాసేపు ఆటపట్టిస్తూ, ఇద్దరి కాంబోలో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమా గురుంచి మాట్లాడుకున్నారు. ఇక రౌడీ హీరో విజయ్‌తో పంచె కట్టి మరీ బాక్సింగ్ చేశాడు. సమరసింహారెడ్డి వెల్‌కంస్ అర్జున్ రెడ్డి అంటూ విజయ్‌ని బాలయ్య ఆహ్వానించాడు. ఇక ముగ్గురికి కొబ్బరి బోండాలను బాలయ్య తన చేతులతో కొట్టి ఇచ్చాడు. చివరలో ముగ్గురితో కలిసి లైగర్ మూవీలోని “వాట్ లగా దేంగే” డైలాగ్‌ని పవర్‌ఫుల్‌గా చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్రోమో అటు విజయ్, ఇటు బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :