అన్‌స్టాపబుల్: సంక్రాంతికి లైగర్ టీమ్ తో బాలయ్య సందడి..!

Published on Jan 9, 2022 2:02 am IST

నందమూరి బాలకృష్ణ ఆహాలో వచ్చే “అన్‌స్టాపబుల్” షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్లతో బాలయ్య చేస్తున్న సందడి ప్రేక్షకులకు ఫుల్ టూ ఎంటర్‌టైన్‌ని ఇస్తుంది. అయితే ఈ శుక్రవారం రానా దగ్గుబాటితో ఆటలు ఆడిన బాలకృష్ణ, సంక్రాంతికి లైగర్ టీమ్ తో అల్లరి చేయబోతున్నాడు.

ఇక తాజాగా ఈ ఎపిసోడ్ పోస్టర్‌ని ఆహా రిలీజ్ చేసింది. జనవరి 14న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని, త్వరలోనే ప్రోమోను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘పైసా వసూల్’ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే లైగర్ షూటింగ్ లో బాలయ్య సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక స్పెషల్ రోల్‌లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్న్నాయి. మరి ఆ విషయంపై ఈ ఎపిసోడ్‌లో ఏమైనా హింట్ ఇస్తారేమో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :