‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ – ప్రభాస్ ఎపిసోడ్ టెలికాస్ట్ టైం లాక్

Published on Dec 29, 2022 4:03 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటిటి లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రతి వారం పలువురు గెస్ట్ లతో మంచి సరదా, ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఎపిసోడ్స్ ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. కాగా ఈ సీజన్ 2 యొక్క లేటెస్ట్ ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యాక్షన్ హీరో గోపీచంద్ ఇద్దరూ ప్రత్యేక గెస్ట్ లు గా విచ్చేసారు. ఇప్పటికే ఈ స్పెషల్ ఎపిసోడ్ యొక్క రెండు ప్రోమోస్ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుని ఫుల్ ఎపిసోడ్ పై మంచి ఆసక్తిని ఏర్పరిచాయి.

కాగా ప్రభాస్, గోపీచంద్ ల ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నట్లు ఆహా వారు ఇటీవల ప్రకటించారు. అయితే విషయం ఏమిటంటే ఈ ఎపిసోడ్ మొదటి భాగాన్ని నేడు రాత్రి 9 గం. ల నుండి టెలికాస్ట్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం ఆహా వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. మొత్తంగా తమ అభిమాన డార్లింగ్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న తమకు ఫైనల్ గా టెలికాస్ట్ టైం అనౌన్స్ కావడంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

సంబంధిత సమాచారం :