అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 టీజర్ రిలీజ్ కి రెడీ!

Published on Oct 3, 2022 1:00 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా వీడియో లో ఒక సెలబ్రిటీ టాక్ షో ను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ వచ్చిన ఈ షో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 తో మళ్ళీ ఎంటర్ టైన్ చేయడానికి సిద్దం అయ్యారు బాలకృష్ణ.

విజయవాడ లో ఈ షో కి సంబందించిన టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇందుకోసం గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు మేకర్స్. రేపు సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ స్టార్ట్ కానుంది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ టీజర్ కి దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది.

ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నట్లు సమాచారం. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2 మరింత వినోదాన్ని అందిస్తుందని ఆహా ప్రచారం చేస్తోంది. ఈ షో కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :