అన్ స్టాపబుల్: ANR ను ఇమిటేట్ చేసిన బాలయ్య…అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అద్దిరిపోయింది!

Published on Dec 5, 2021 6:13 pm IST


నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆహా వీడియో లో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే కార్యక్రమం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం లో ఇప్పటి వరకు వచ్చిన ఎపిసొడ్స్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరొక ఎపిసొడ్ ఇప్పుడు ఆహా వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మరియు అనీల్ రావిపూడి లు కలిసి ఈ షో కి రావడం జరిగింది. ఈ షో అంతా కూడా ఎంతో ఎంటర్ టైనింగ్ గా, మరియు అన్ లిమిటెడ్ ఫన్ తో కొనసాగింది.

ఈ కార్యక్రమం మధ్య లో బ్రహ్మానందం ఏఎన్ఆర్ ను ఇమిటేట్ చేయండి అంటూ బాలకృష్ణ ను అడగగా, భారీ డైలాగ్ తో అలరించారు. బ్రహ్మానందం మీదికి పడి మరీ హాస్యాన్ని పుట్టించారు. అనిల్ రావిపూడి సైతం బాలకృష్ణ చెబుతున్న డైలాగ్ ను ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆహా వీడియో లో నేటి నుండి ప్రసారం కానుంది. బాలకృష్ణ అటు సినిమాలు చేస్తూనే, ఇటు ఈ కార్యక్రమం తో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :