అన్ స్టాపబుల్: రవితేజ, గోపీచంద్ మలినేని లతో…సరికొత్త ప్రోమో విడుదల!

Published on Dec 30, 2021 9:30 pm IST

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే కార్యక్రమం కి విశేష స్పందన వస్తోంది. ఆహా వీడియో వేదిక గా వస్తున్న ఈ కార్యక్రమం ను ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇప్పటి వరకు పలు సినీ ప్రముఖులతో షో ను ఆకట్టుకున్న బాలయ్య ఇప్పుడు మరింత ఎనర్జీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.

డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని మరియు మాస్ మహారాజ్ రవితేజ తో షో ను చేసేందుకు సిద్దం అయ్యారు. ఇందుకు సంబంధించిన సరికొత్త ప్రోమో ను ఆహా వీడియో తాజాగా విడుదల చేయడం జరిగింది. వీరు ముగ్గురు కూడా మరింత ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ రేపు రాత్రి 8 గంటల కు ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :