అన్‌స్టాపబుల్ 2: నెక్స్ట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ప్రోమో ను రిలీజ్ చేసిన ఆహా!

Published on Dec 1, 2022 4:41 pm IST

టాలీవుడ్ పెద్దలు అయిన అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు మరియు కోదండ రామిరెడ్డి లు అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2 తదుపరి ఎపిసోడ్‌కు వస్తున్నారని ఆహా వీడియో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ఎపిసోడ్ 5 ప్రోమో ఇప్పుడు బయటకు వచ్చింది.

వీరి మధ్య ఉన్న అనుబంధం, 90 ఇయర్స్ తెలుగు సినిమా, బంధుప్రీతి తదితర అంశాల గురించి ప్రముఖ నిర్మాతను బాలకృష్ణ అడిగారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ప్రోమోలో కనిపించారు. లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ దర్శనంతో ప్రోమో ముగిసింది. ప్రోమో ఎపిసోడ్‌పై అంచనాలను పెంచింది. ఇది డిసెంబర్ 2, 2022న రాత్రి 9 గంటలకు ఆహాలో ప్రసారం కానుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :