అన్ స్టాపబుల్2: రిలీజ్ కి ముందే హిస్టరీ క్రియేట్ చేసిన పవన్ ఎపిసోడ్

Published on Feb 2, 2023 7:04 pm IST

స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి ఆహా వీడియో లో ప్రసారం అయ్యే అన్ స్టాపబుల్ కార్యక్రమంలో కనిపించబోతున్నారు. ఆహా వీడియో లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ప్రముఖ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2 చివరి ఎపిసోడ్‌లో పవన్ ప్రత్యేక అతిథిగా కనిపించనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్‌లోని మొదటి భాగం ఈరోజు రాత్రి 9 గంటలకు ఆహాలో ప్రసారం కానుంది. ఇద్దరు స్టార్స్ ను ఒకే ఫ్రేమ్ లో చూసేందుకు అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ప్రారంభించకముందే మునుపెన్నడూ లేని రికార్డును సృష్టించింది. విజయవాడలో బాలయ్య, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇరువురు తారలు ఉన్న భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. కాబట్టి, అభిమానులు మొదటిసారిగా టాక్‌షో ఎపిసోడ్ కోసం కటౌట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా చరిత్రను సృష్టించారు. ఈ రాత్రి ఎపిసోడ్‌లో, పవన్ తన మూడు పెళ్లిళ్లతో సహా తన సినిమా, రాజకీయ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అంశాల పై మాట్లాడనున్నారు.

సంబంధిత సమాచారం :