పిల్లల్నెప్పుడు ప్లాన్ చేస్తున్నారు.. ఉపాసన ఫుల్ క్లారిటీ ఇచ్చిందిగా..!

Published on Nov 11, 2021 11:00 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసనలకు పెళ్ళై దాదాపు ఎనిమిదేళ్లు అయిపోయింది. అయినా ఈ జంట ఇప్పటి వరకు పిల్లలకి సంబంధించి ఎలాంటి ప్లాన్ చేయలేదు. వీరి నుంచి ఎప్పుడు గుడ్ న్యూస్ వింటామా అని మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన పిల్లల విషయంపై స్పందించింది.

ఈ మధ్య పిల్లల గురుంచి చాలామంది అడుగుతూనే ఉన్నారని, కానీ దీనికి నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నప్పుడే చెప్తానని, ఇప్పుడు దీనిపై నేను ఏమి మాట్లాడినా అది సెన్సేషనే అవుతుందని, అది తనకిష్టం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సంబంధిత సమాచారం :