చిరంజీవికి కోడలు ఉపాసన చేసిన ప్రామిస్ ఏమిటో తెలుసా !


ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన కోడలు ఉపాసన కామినేని ఆయనకు ఓ ప్రామిస్ చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె ఆ ప్రామిస్ ఏమిటో రివీల్ చేశారు. తన మావయ్య తనకు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ రామ్ చరణ్ అని, ఈ పుట్టినరోజునాడు కుటుంబాన్ని, చరణ్ ను సంతోషంగా ఉంచుతానని మావయ్యకు మాటిచ్చానని, అది తనకో అందమైన బాధ్యతని చెప్పుకొచ్చారు ఉపాసన.

అలాగే ‘మావయ్యకు నేనంటే ఎంతో నమ్మకం, నేను ఏ పని చేసిన బాగా చేస్తాననే నమ్ముతారు. అయినా ఇంకా బాగా చేయమని ప్రోత్సహిస్తారు. ఉద్యోగం చేసే ఆడవాళ్లంటే ఆయనకు ఎంతో నమ్మకం, గౌరవం. చరణ్ కు నాన్నంటే ఏంటో ప్రేమ, గౌరవం. ఏ తండ్రైన కొడుకు నుండి ఆశించేది వాటినే. ఆయన 150వ సినిమా మాకందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ ఆయిన సినిమా. మావయ్య అన్నిటిలో మాస్టర్ అయితే చరణ్ ఆయనకు స్టార్ శిష్యుడు అవుతాడు’ అన్నారు.