రెండేళ్ల తర్వాత వెకేషన్ కి…రామ్ చరణ్ కి ఉపాసన థాంక్స్

Published on Mar 6, 2022 7:30 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయారు. తాజాగా సినిమా షూటింగ్ ల నుండి విరామం తీసుకున్న రామ్ చరణ్ ఎట్టకేలకు వెకేషన్ కి భార్య ఉపాసన తో వెళ్తున్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఒక ఫోటో ను కొణిదెల ఉపాసన సోషల్ మీడియా వేదిక గా షేర్ చేయడం జరిగింది. రామ్ చరణ్ మాస్క్ పెట్టుకొని ఉండగా, ఉపాసన చిరు నవ్వులు చిందిస్తోంది. రెండేళ్ల తర్వాత వెకేషన్ కి అని, థాంక్ యూ మిస్టర్ సి అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చ్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ మరొక హీరో. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి తో సైతం రామ్ చరణ్ ఆచార్య చిత్రం లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :