‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Aug 1, 2022 3:26 PM IST

 

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సినిమాలు :

పక్కా కమర్షియల్‌ – ఆగస్టు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

మహా – ఆగస్టు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

ఈ వారం అమెజాన్‌ ప్రేమ్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు :

కడువా – ఆగస్టు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ఆల్‌ ఆర్‌ నథింగ్‌ (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

క్రాష్‌ కోర్స్‌ (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

థర్టీన్‌ లైవ్స్‌ – ఆగస్టు 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

ఈ వారం నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సిరీస్ :

డార్లింగ్స్‌ – ఆగస్టు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కార్టర్‌ (కొరియన్‌ చిత్రం) – ఆగస్టు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద సాండ్‌మ్యాన్‌ (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

లైట్‌ ఇయర్‌ – ఆగస్టు 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం వూట్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

ద గ్రేట్‌ వెడ్డింగ్‌ ఆఫ్‌ మున్నీస్‌ – ఆగస్టు 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఇక థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాలు రెండు :

బింబిసార :

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ఓ చారిత్రక కథాంశంతో రాబోతున్న సినిమా ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిన ఈ ఫాంటసీ డ్రామా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

సీతారామం :

దుల్కర్‌ సల్మాన్‌, మృణాలిని ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా కూడా ఆగస్టు 5న రిలీజవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు