ఈ వారం థియేటర్‌/ ఓటీటీలోకి అలరించే సినిమాలివే !

Published on Dec 13, 2021 2:03 pm IST

బాలయ్య ‘అఖండ’ అఖండ విజయంతో తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఉత్సాహం రెట్టింపు అయింది. అఖండ ఇచ్చిన విజయోత్సవంతో ఈ వారం కూడా భారీ బడ్జెట్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి

ఈ వారం థియేటర్‌ లో రిలీజవుతున్న చిత్రాలివే !

‘పుష్ప’ :

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. కాగా ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబరు 17న విడుదల కానుంది. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ, అజయ్‌ఘోష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

 

‘స్పైడర్‌ మ్యాన్‌’ :

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆస్వాదించే సూపర్‌ హీరో పాత్ర ‘స్పైడర్‌ మ్యాన్‌’. చేతుల్లో నుంచి దారాలను వదులుతూ అతను చేసే సాహసాలు అలరిస్తాయి. మరోసారి అలా అలరించేందుకు సిద్ధమయ్యాడు స్పైడర్‌ మ్యాన్‌.

జాన్‌ వాట్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘స్పైడర్‌ మ్యాన్‌’ డిసెంబరు 16న ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లోనూ భారీ స్థాయిలో విడుదల కానుంది. టామ్‌ హోలాండ్‌, జందాయా, బెనిడిక్ట్‌ కంబర్‌బ్యాచ్‌, జాకబ్‌ బ్యాట్‌ లాన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భూమిని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువులు ఎవరు? వారిని స్పైడర్‌ మ్యాన్‌ ఎలా ఎదుర్కొన్నాడు ? అనే కోణంలో ఈ సినిమా సాగనుంది.

 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సినిమా :

రాజ్‌ తరుణ్ కథానాయకుడిగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అనుభవించు రాజా’. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో డిసెంబరు 17 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం సోనీ లివ్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ :

ది విజిల్‌ బ్లోయర్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది విచ్చర్‌ (వెబ్‌ సిరీస్‌) డిసెంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కడశీల బిర్యాని (తమిళ్‌) డిసెంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సినిమాలు :

420 ఐపీసీ(హిందీ) డిసెంబరు 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :