‘ఓటీటీ’ : ఈ వారం రాబోతున్న చిత్రాలివే!

Published on Jan 3, 2022 12:17 pm IST

కరోనా మూడో వేవ్ దెబ్బకు భారీ సినిమాలు వాయిదా వైపు అడుగులు వేశాయి. ఈ క్రమంలో ఈ వారంలో రిలీజ్ కావాల్సిన పాన్ ఇండియా భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కూడా వాయిదా పడింది. దాంతో, ఈ వారం రాబోయే సినిమాలకు, ఓటీటీ చిత్రాలకు మరియు సిరీస్ లకు లైన్ క్లియర్ అయింది.

ఎలాగూ ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాబట్టి, ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సినిమా :

 

నాగశౌర్య హీరోగా వచ్చిన స్పోర్ట్స్‌ డ్రామా ‘లక్ష్య’ సినిమా ‘ఆహా’లో 2022 జనవరి 7 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది. థియేటర్లలో విజయం సాధించలేకపోయిన ఈ సినిమా మరి ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఏ స్థాయి విజయం సాధిస్తోందో చూడాలి. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ కథకు సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించారు.

 

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ సిరీస్ :

 

నాగశౌర్య హీరోగా వచ్చిన ‘వరుడు కావలెను’ సినిమా జీ5 ఓటీటీ వేదికగా జనవరి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది.

కౌన్‌ బనేగీ షికార్వతి (హిందీ సిరీస్‌) జనవరి 07వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారం అవుతున్న సినిమా :

 

ద టెండర్‌ బార్‌ (హాలీవుడ్) జనవరి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం ఎంఎక్స్‌ ప్లేయర్‌ లో ప్రసారం అవుతున్న సిరీస్ :

 

క్యాంపస్‌ డైరీస్‌ (హిందీ సిరీస్‌) జనవరి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం సోనీ లివ్‌ లో ప్రసారం అవుతున్న సిరీస్ :

 

క్యూబికల్స్‌ (హిందీ సిరీస్‌) జనవరి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం నెట్‌ ఫ్లిక్స్‌ ఒరిజినల్స్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

 

మదర్‌/ఆండ్రాయిడ్‌ (హాలీవుడ్‌) జనవరి 07వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :