‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే!

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే!

Published on Mar 21, 2022 2:20 PM IST

భారీ సినిమాలు అన్నీ ఇప్పటికే థియేటర్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న పలు చిత్రాల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

 

కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే:

 

ఈ వారం అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న సిరీస్ :

 

డ్యూన్ (హాలీవుడ్‌) మార్చి 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం డిస్నీ+హాట్‌ స్టార్‌ లో ప్రసారం అవుతున్న మూవీ :

 

పారలెల్స్‌ (ఒరిజినల్‌ మూవీ) మార్చి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ :

 

బ్రిడ్డిటన్‌ (వెబ్‌సిరీస్‌2) మార్చి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం ఎంఎక్స్‌ ప్లేయర్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ :

 

రుహానియత్‌ (హిందీ) మార్చి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం ఊట్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ :

 

హలో (వెబ్‌సెరిస్‌) మార్చి 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు