‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Feb 28, 2022 3:00 PM IST

కరోనా మూడో వేవ్ తగ్గుముఖం పట్టడంతో సినిమాలన్నీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న పలు చిత్రాల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సినిమా :

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ సినిమా ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో మార్చి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

 

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా :

 

విశాల్‌ కథానాయకుడిగా శరవణన్‌ దర్శకత్వంలో తాజా చిత్రం ‘సామాన్యుడు’ మార్చి 1వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

 

గ్రైన్స్‌ ద ఐస్‌(హాలీవుడ్‌) మార్చి 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద వీకెండ్‌ ఎ వే (హాలీవుడ్‌) మార్చి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పీసెస్‌ ఆఫ్‌ హర్‌ (ఒరిజినల్‌ సిరీస్‌)మార్చి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న సినిమా :

 

నో టైమ్‌ టు డై (హాలీవుడ్‌) మార్చి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం సోనీ లివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ సిరీస్ :

 

అన్‌ దేఖీ (హిందీ సిరీస్‌) మార్చి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం ఎమ్ ఎక్స్ ప్లేయర్‌ లో ప్రసారం అవుతున్న సిరీస్ :

 

వాండర్‌లస్ట్‌ (హిందీ సిరీస్‌) మార్చి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం డిస్నీ – హాట్‌ స్టార్ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

 

రుద్ర ద ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ (హిందీ సిరీస్‌) మార్చి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సుత్‌ లియాన్‌ (హిందీ సిరీస్‌) మార్చి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు