‘ఓటీటీ’ : ఈ వారం దసరాకి అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం దసరాకి అలరించే చిత్రాలివే !

Published on Oct 3, 2022 4:30 PM IST

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. పైగా దసరా సెలవులు వచ్చేశాయి. పండగ వేళ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ప్రసారం అవుతున్న సినిమా :

రంగరంగ వైభవంగా (తెలుగు) ఇప్పటికే స్ట్రీమింగ్‌ మొదలైంది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

మజా మా (హిందీ) అక్టోబరు 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా :

రక్షాబంధన్‌ (హిందీ) అక్టోబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

గాలి పటా2 (కన్నడ) అక్టోబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ వెబ్ సిరీస్ :

ఎక్స్‌పోజ్‌డ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ప్రే (హాలీవుడ్‌) అక్టోబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

ఆహా లో ప్రసారం అవుతున్న సినిమా :

దర్జా (తెలుగు) అక్టోబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ఉనికి (తెలుగు)అక్టోబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

లయన్స్‌ గేట్‌ప్లే లో ప్రసారం అవుతున్న సినిమా :

ఫీల్స్‌ లైక్‌ హోం (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

సోనీలివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

ఈషో (మలయాళం/తెలుగు) అక్టోబరు 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు