రామారావు ఆన్ డ్యూటీ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Dec 30, 2021 4:00 pm IST

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ మరియు ఆర్టి టీమ్ వర్క్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ పై చిత్రం యూనిట్ సోషల్ మీడియా వేదిక గా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తాం అని వెల్లడించడం జరిగింది. అంతేకాక వచ్చే ఏడాది 2022 వైరస్ ఫ్రీ గా ఉండాలని, అంతేకాక భవిష్యత్ మొత్తం కూడా అదే విధంగా ఉండాలి అంటూ కోరుకుంటూ డైరెక్టర్ శరత్ మండవ సోషల్ మీడియా వేదిక గా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం లో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ పాత్రలో నటిస్తుండగా, సామ్ సి. ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :