‘అజ్ఞాతవాసి’ సెన్సార్ అప్డేట్!

జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘అజ్ఞాతవాసి’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. 9వ తేది మిడ్ నైట్ నుండి బెనిపిట్ షోస్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాత చినబాబు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. పవన్ పాడిన పాట విశేషంగా ఆకట్టుకుంటోంది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తి అవొచ్చని తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాను తిలకిస్తున్నారట. ఈ నెల 5న చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమా పవన్ కెరీర్ లో 25వ సినిమా అవ్వడం విశేషం. అనుఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ ల గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.