రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘భరత్ అనే నేను’ !

17th, October 2017 - 04:34:26 PM

ఈ మధ్యే ‘స్పైడర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే ‘భరత్ అనే నేను’ సినిమాతో సందడి చేయనున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన సిఎం క్యాంప్ ఆఫీస్ సెట్లో కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘శ్రీమంతుడు’ పెద్ద హిట్ గా నిలవడంతో ఈ చిత్రంపై కూడా భారీ ఆశల్ని పెట్టుకున్నారు మహేష్ ఫ్యాన్స్.

అందుకు తగ్గటే కమర్షియల్ అంశాలకి, రాజకీయ పరమైన సోషల్ పాయింట్ ను జోడించి గ్రాండ్ గా సినిమాను చేస్తున్నాడు కొరటాల. ఇప్పటికే కొంత మేర షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రాన్ని 2018 ఆరంభంలో నాటికి ముంగించేసి ఏప్రిల్ 20న రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.