గోపీచంద్ కొత్త మూవీ గురించి అప్ డేట్ !

Gopichand11

యాక్షన్ హీరో గోపీచంద్ వరుసగా కొన్ని పరాజాయాల తర్వాత ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కుమార్ అనే ఓ నూతన దర్శకుడి దర్శకత్వంలో గోపీచంద్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రధానంగా లవ్ ఎంటర్టైనర్ తో కూడుకున్న యాక్షన్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఐతే ఈ చిత్రం తర్వాత గోపీచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సంపత్ నంది ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గోపిచంద్ కి సంపత్ చెప్పిన ఫుల్ స్క్రిప్ట్ కూడా బాగా నచ్చిందట.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి సంపత్, గోపీచంద్ కి హిట్ ఇస్తాడేమో చూడాలి.

Exit mobile version