హరీష్ శంకర్ – సల్మాన్ ఖాన్ భేటీ పై అప్డేట్

Published on Apr 15, 2022 9:02 pm IST

కొన్ని రోజుల క్రితం, దర్శకుడు హరీష్ శంకర్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో పోజులిచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలత కొత్త ఊహాగానాలు దారితీశాయి. ఇప్పుడు హరీష్ సల్మాన్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడని అందుకే హరీష్ స్టార్ హీరోని కలిశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్.

ఈ ప్రాజెక్ట్ వెనుక ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఉందని గాసిప్ మరింత ముందుకు సాగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ధారణ లేనప్పటికీ, ఈ వార్త అంతటా వైరల్‌గా మారింది. మరి ఈ ప్రాజెక్ట్‌కి సల్మాన్‌ ఆమోదం తెలుపుతాడో లేదో చూడాలి మరి. గతంలో హరీష్ శంకర్ సల్మాన్ ఖాన్ దబాంగ్ చిత్రాన్ని గబ్బర్ సింగ్ పేరిట రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :