కొరటాల శివ సినిమా ఆగిపోలేదు !

20th, December 2017 - 11:45:02 AM

టాలీవుడ్ టాప్ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ మహేష్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చరణ్ తో సినిమా ఉండబోతుందని ఆఫీషియల్ గా ఇంతకుముందే అనౌన్స్ చేసారు. కానీ ఈ మద్య ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తలో నిజం లేదు. ‘భరత్ అనే నేను’ సినిమా ఏప్రిల్ లో విడుదలకానుంది. జూలై లో కొరటాల, చరణ్ సినిమా ప్రారంభం కాబోతోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా బోయపాటితో మరో సినిమా చెయ్యబోతున్నాడు చరణ్.