క్షీణించిన లతా మంగేష్కర్ ఆరోగ్యం

Published on Jan 16, 2022 5:25 pm IST


కొద్ది రోజుల క్రితం, ప్రఖ్యాత నేపథ్య గాయని లతా మంగేష్కర్ కరోనా వైరస్ బారిన పడి ఐసియూ లో చేరారు. అప్పటి నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే కొనసాగుతోంది. 92 ఏళ్ల గాయకురాలికి కోవిడ్‌ తో పాటు న్యుమోనియా కూడా వచ్చింది. దీంతో ఆమె ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఎవరినీ కలవనివ్వడం లేదు.

భారతరత్న అవార్డు గ్రహీత ఎంతకాలం ఐసీయూలో ఉండాలనే విషయంపై వైద్యులు నోరు మెదపడం లేదు. లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు మరియు శ్రేయోభిలాషులు ప్రార్థనలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :