త్వరలో కొత్త చిత్రంతో బిజీ కానున్న ప్రభాస్ !


బాహుబలి 2 చిత్రం షూటింగ్ ని ఇప్పటికే పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.దీనితో చలల రోజుల తరువాత ప్రభాస్ కు తీరిక సమయం దొరికింది. కాగా ప్రభాస్ త్వరలోనే తన కొత్త చిత్రం పనుల్లో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తరువాతి చిత్రం సుజీత్ దర్శకత్వం లో రాబోతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబందించిన పనులు ఫిబ్రవరిలో మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం.ఈ చిత్రం లో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. యువీ క్రియోషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.