పుష్ప ది రైజ్: శరవేగంగా అల్లు అర్జున్ సమంత ల స్పెషల్ సాంగ్ షూటింగ్!

Published on Nov 30, 2021 6:02 pm IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ను పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ముత్తంశెట్టి మీడియా తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం లో ఒక స్పెషల్ సాంగ్ ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ సమంత ను తీసుకుంది. మొదటి సారి ఒక స్పెషల్ సాంగ్ కి సమంత చేయడం విశేషం. ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ భారీ సెట్స్ లో జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ పోస్టర్ లో సమంత బ్యాక్ పోజ్ పెట్టి ఉంది. ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. ఇందుకు సంబంధించిన సాంగ్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

సుకుమార్ అల్లు అర్జున్ కాంబో లో వస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం లో మలయాళ నటుడు ఫాహద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :