నాకు సర్జరీ కూడా బాగా జరిగింది – సిద్ధార్థ్‌

Published on Oct 2, 2021 11:26 pm IST

మాజీ లవర్ బాయ్ సిద్ధార్థ్‌ ‘మహా సముంద్రం’ సినిమా యాక్షన్ సీక్వెన్స్ చేస్తోన్న సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే. దర్శకడు అజయ్‌ భూపతి కూడా సిద్ధార్థ్‌ వెన్నుముకకు బాగా గాయమైందని వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా అందుకే సర్జరీ కోసం లండన్‌ వెళ్ళాడు సిద్దార్థ్‌. తాజాగా సిద్దార్థ్‌ తన హెల్త్ పై క్లారిటీ ఇచ్చాడు.

ఇన్‌ స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ఇండియాకు తిరిగి వచ్చాక, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని.. ప్రస్తుతం హైదరాబాద్‌ కి వచ్చాను అని, ‘మహా సముంద్రం’ సినిమాకి డబ్బింగ్‌ చెబుతున్నానని.. సిద్దార్థ్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా ‘మహా సముంద్రం’ సినిమా రిలీజ్‌ కోసం తాను ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నానని, తన స్పైన్‌ సర్జరీ కూడా బాగా జరిగిందని సిద్దార్థ్‌ చెప్పుకొచ్చాడు.

ఇక ‘మహా సముంద్రం’ మూవీ అక్టోబర్‌ 14న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :