‘అన్ స్టపాబుల్ సీజన్ – 2’ పై క్రేజీ అప్ డేట్

Published on Sep 17, 2022 12:59 am IST

నందమూరి బాలకృష్ణ హోస్టు గా ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ప్రసారమైన క్రేజీ షో అన్ స్టాపబుల్. ప్రతి ఎపిసోడ్ లో భాగంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ గెస్టలు గా విచ్చేసి తమ లైఫ్, కెరీర్ గురించిన పలు సంగతులను ఈ షో ద్వారా ఆడియన్స్ తో పంచుకునేవారు. ఇక హోస్ట్ గా బాలయ్య తన మార్క్ సరదా పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుని అందరి నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించారు. ఆవిధంగా ఆకట్టుకునే రీతిలో సరదాగా సాగిన ఈ షోకి బాగా రెస్పాన్స్ రావడంతో పాటు వ్యూస్ కూడా విపరీతంగా లభించాయి.

ఇక ఈ క్రేజీ షో యొక్క సెకండ్ సీజన్ కోసం ఆడియన్స్ అందరూ ఎప్పటినుంచో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కాగా వారందరి ఎదురుచూపులు అతి త్వరలో ఫలించనున్నాయి. లేటెస్ట్ గా ఆహా వారు రిలీజ్ చేసిన ఒక పోస్టర్లో అతి త్వరలోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రసారం కాబోతున్నట్లు తెలిపారు. ఫస్ట్ సీజన్ ని మించి మరింత అద్భుతంగా తాజా సీజన్ 2 ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ షో గురించిన పూర్తి వివరాలు అలాగే బిగినింగ్ డేట్ త్వరలో వెల్లడి కానున్నాయి. మరి ఈ సీజన్ 2 లో ఎవరెవరు గెస్టులుగా రానున్నారో తెలియాలంటే మరి కొన్నాళ్ల వరకు వెయిట్ చేయాలి.

సంబంధిత సమాచారం :