వెంకీమామ షూటింగ్ అప్డేట్ !

Venky chay

వెంకటేష్ , నాగ చైతన్య ల మల్టీ స్టారర్ వెంకీమామ ఇటీవలే రాజమండ్రి లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ మార్చి చివరి వారంలో స్టార్ట్ కానుంది. ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ అలాగే నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది.

బాబీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ రైస్ మిల్లర్ ఓనర్ గా నటిస్తుండగా చైతూ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దసరా సీజన్ లో ఈచిత్రాన్ని విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version