‘A’ మూవీ రీ-రిలీజ్.. ట్రైల‌ర్ లాంచ్ చేసిన మేక‌ర్స్!

‘A’ మూవీ రీ-రిలీజ్.. ట్రైల‌ర్ లాంచ్ చేసిన మేక‌ర్స్!

Published on Jun 15, 2024 9:30 AM IST

క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్రకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న న‌టించిన చాలా సినిమాలు ఇక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లుగా నిలిచాయి. కాగా, ఉపేంద్ర కెరీర్ లో సాలిడ్ హిట్ మూవీగా నిలిచిన ‘A’ చిత్రాన్ని ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

ఉప్పి క్రియేష‌న్స్, చందు ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని తెలుగులో 4కేలో రీ-రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. జూన్ 21న ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ చేస్తున్న‌ట్లు వారు పేర్కొన్నారు. చందు ఎంట‌ర్టైన్మెంట్ స్థాప‌కులు లింగం యాద‌వ్ మాట్లాడుతూ.. ‘A’ చిత్రాన్ని తెలుగులో రీ-రిలీజ్ చేస్తామ‌ని ఉపేంద్ర గారికి చెప్ప‌గానే ఆయన స్పందించిన తీరుకి అభిమానిని అయిపోయాను.. అని అన్నారు.

ఇక నిర్మాత సైదులు మాట్లాడుతూ.. ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తామ‌ని ఉపేంద్రకు చెప్పిన‌ప్పుడు ఆయ‌న స్పందించిన విధానం నాకు బాగా న‌చ్చింది. ఈ సినిమా రీ-రిలీజ్ కోసం ఓ వీడియో బైట్ కావాల‌ని అడిగితే, ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చి మాట్లాడుతా అని చెప్ప‌డం నాకు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఆదరిస్తార‌ని ఆశిస్తున్నా… అని అన్నారు.

హీరో ఉపేంద్ర మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని అప్పుడు ఆదరించిన ప్రేక్షకులకు, ఇప్పుడు రీ-రిలీజ్ సైతం ఆదరించడానికి సిద్ధంగా ఉన్న నవతరం ప్రేక్షకులకు ధన్యవాదాలు. A సినిమా నా జీవితంలో మర్చిపోలేనిది.. 26 సంవత్సరాల క్రితం ఈ చిత్రం విడుదల అవుతున్న సమయంలో ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నా. కచ్చితంగా జూన్ 21న ఈ మూవీని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి.. అని పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు