ఉపేంద్ర పాన్ ఇండియన్ సినిమా ‘కబ్జా’ మోషన్ పోస్టర్ విడుదల..!

ఉపేంద్ర పాన్ ఇండియన్ సినిమా ‘కబ్జా’ మోషన్ పోస్టర్ విడుదల..!

Published on Sep 18, 2021 3:38 PM IST

ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా ఆర్ చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం “కబ్జా”. ఎస్ఎస్ఈ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ఎంటీబీ నాగరాజు సమర్పణలో ఆర్ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నేడు ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

అయితే 1960ల నేపథ్యంలో తెరకెక్కుతున్న కబ్జా సినిమాలో ఉపేంద్ర పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. చేతిలో కత్తి పట్టుకుని ఉన్న పోస్ట్ అందరిని ఆకట్టుకుంటుంది. రవి బసృర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కబ్జా చిత్ర టీజర్ దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ త్వరలోనే తెలియజేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు