అంతకంతకు హైప్ పెంచేస్తున్న ఉపేంద్ర ‘కబ్జ’

Published on Mar 2, 2023 2:15 am IST


కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర హీరోగా ఆర్ చంద్రు రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ కబ్జ. ఎస్ ఎస్ ఈ, ఇన్వెనియో ఆరిజిన్ సంస్థల పై ఎంతో భారీ వ్యయంతో రూపొందుతోన్న ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఎన్నో అంచనాలు ఏర్పరిచింది. మార్చి 17న కబ్జ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

కాగా శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ యొక్క ఆడియో రిలీజ్ వేడుకకి పవన్ కళ్యాణ్ వెళ్ళవలసింది, కానీ తన కమిట్మెంట్స్ వలన రాలేకపోతున్నట్లు ఇటీవల ఒక ప్రకటన ద్వారా కబ్జా టీమ్ కి తెలిపారు. ఇక కిచ్చా సుదీప్ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ యూట్యూబ్ లో మంచి ఆదరణ అందుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచేసాయి. ఇటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఉపేంద్ర కు మంచి క్రేజ్ ఉండడంతో దీనిని తెలుగులో కూడా గ్రాండ్ గా ప్రమోట్ చేయాలని యూనిట్ ఆలోచన చేస్తోందట. మరి ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ ద్వారా ఉపేంద్ర ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :