ఉపేంద్ర “కబ్జా” రన్ టైమ్ లాక్డ్

Published on Mar 14, 2023 3:00 pm IST

శాండల్‌వుడ్ స్టార్స్ ఉపేంద్ర మరియు కిచ్చా సుదీప్ నటించిన కబ్జా మార్చి 17, 2023న థియేటర్‌లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో శ్రియ శరణ్ కథానాయికగా నటించింది. ప్రస్తుతం టీమ్ ఆఫ్‌లైన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజా సమాచారం ఏమిటంటే, సినిమా యొక్క రన్‌టైమ్ లాక్ అయ్యింది. 136 నిమిషాల నిడివి తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతోంది.

తెలుగుతో సహా 7 భారతీయ భాషల్లో విడుదల కానున్న కబ్జాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ పాన్ ఇండియన్ చిత్రంలో శివరాజ్‌కుమార్, శ్రియా శరణ్, దేవ్ గిల్, కోట శ్రీనివాసరావు, మురళీ శర్మ, సుధ మరియు కబీర్ దుహన్ సింగ్ ప్రముఖ పాత్రలు పోషించారు. KGF ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు సమకూర్చారు.

సంబంధిత సమాచారం :