మరో యంగ్ హీరోతో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు..!

Published on Sep 4, 2021 2:09 am IST


ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు గుర్తున్నాడు కదా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడుగా పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు తన మొదటి సినిమా “ఉప్పెన”తో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బుచ్చి బాబుకు మరియు హీరో, హీరోయిన్లకు ఇది తొలి సినిమానే అయినా కూడా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు తన నెక్స్ట్ సినిమాను ఎవరితో ప్లాన్ చేస్తాడన్నది ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే.

అయితే ఆ మధ్య బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్‌‌తో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత మళ్లీ వైష్ణవ్ తేజ్‌తోనే చేస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం బుచ్చిబాబు తన రెండో సినిమాను ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలు ఒప్పుకోవడం వలన డేట్లు కుదరకపోవడంతో మరో యంగ్ హీరోతో సినిమా చేయాలని బుచ్చిబాబు డిసైడ్ అయ్యాడట. మరీ ఆ యంగ్ హీరో ఎవరన్నది ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :