“మధుర వైన్స్” ట్రైలర్ చూస్తుంటే కల్ట్ ఫిల్మ్ తీసినట్లు అనిపించింది – ఉప్పెన డైరెక్టర్

“మధుర వైన్స్” ట్రైలర్ చూస్తుంటే కల్ట్ ఫిల్మ్ తీసినట్లు అనిపించింది – ఉప్పెన డైరెక్టర్

Published on Oct 18, 2021 8:42 PM IST

ఎస్ ఒరిజినల్స్, ఆర్.కే సినీ టాకీస్ బ్యానర్ పై సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో రాజేష్ కొండెపు నిర్మిస్తున్న చిత్రం మధుర వైన్స్. గతం, తిమ్మరుసు లాంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోలు ఈ చిత్రానికి అసోసియేట్ అవ్వడంతో ఇండస్ట్రీ లో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. త్వరలో ఎస్ ఒరిజనల్స్ నుంచి అద్భుతం, పంచతంత్రం చిత్రాలు కూడా రాబోతున్నాయి. మధుర వైన్స్ సినిమా కి సంబంధించిన ప్రచార చిత్రాలు, ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అక్టోబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా మధుర వైన్స్ ప్రేక్షకుల ముందుకి వస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, శ్రీకారం దర్శకుడు కిషోర్, హీరో సందీప్ కిషన్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యి చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, “పెళ్లికి ముందు మనం ఫంక్షన్ చేసుకుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, ఈ సినిమాకు కూడా టీమ్ అంతా కష్టపడి కలిసి పని చేసిన తరువాత సినిమా కష్ట సుఖాలను పంచుకోవడానికి జరుపుకునే సెలబ్రేషన్స్ వేడుకే ప్రి రిలీజ్ ఈవెంట్. నాకు కాన్ఫిడెంట్ గా మాట్లాడే వారంటే ఏంతో ఇష్టం. ఈ స్టేజ్ పై హీరో, దర్శకులు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. వారి మాటలను చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. వీరంతా షార్ట్ ఫిల్మ్ నుండి వచ్చినా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే నాకు లైఫ్ ఇచ్చిన వారంతా కూడా షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చిన వారే. ఈ చిత్రం తీసిన దర్శక నిర్మాతలకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని అన్నారు

ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చి బాబు మాట్లాడుతూ, “జయ కిషోర్ నాకు మంచి మిత్రుడు తను నా కన్నా బాగా రాస్తాడు. నాకన్నా మంచి టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కల్డ్ ఫిలిం తీసినట్లు అనిపించింది. ఈ సినిమా తనకు పెద్ద హిట్ అయి మంచి విజయం తో పాటు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని అన్నారు.

నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ, “సృజన్ గారు నాకు యు.యస్ లో మంచి ఫ్రెండ్, ఈ చిత్రం టైలర్స్, సాంగ్స్ చూస్తుంటే చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని అన్నారు.

శ్రీకారం చిత్ర దర్శకుడు కిషోర్ మాట్లాడుతూ, “మేమంతా షార్ట్ ఫిలిమ్స్ నుండే వచ్చాము. మా అందరికీ జయ కిషోర్ బాగా తెలుసు మా అందరి కంటే తనే బాగా రాయగలడు. ఈ సినిమా ట్రైలర్స్ చూశాను చాలా బాగున్నాయి. ఈ సినిమా తనకు గొప్ప విజయాన్ని అందించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను” అని అన్నారు

చిత్ర దర్శకుడు జయ కిషోర్ మాట్లాడుతూ, “ఈ సినిమా గురించి చెప్పే ముందు నాకు పూరి జగన్నాథ్ గారు చెప్పినటువంటి వాక్యము గుర్తొస్తుంది. శత్రువు విసిరిన కత్తికంటే, స్నేహితుడు విసిరిన కత్తి కి పదునెక్కువ అని, అది పర్ ఫెక్ట్ గా ఉంటుందని అన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, అందరూ మీరు సినిమాను తొందరగానే పూర్తి చేశారు కదా, మరి మీ సినిమా ఎందుకు లేట్ అయిందని అడుగుతుంటే, వారికి సమాధానం చెప్పలేక పోయేవాన్ని, దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే ఒక వెబ్ సిరీస్ అవుతుంది. మనం ఒక వ్యక్తిని నమ్మి తనకు నువ్వే కరెక్ట్, నువ్వే ఉండాలని నమ్మి పెట్టుకున్న తర్వాత తనకు తెలిసింది తను చేసుకుంటూ పోతాడు. ఆ తర్వాత తనకు ఏమి వచ్చు అని తెలిసిన తర్వాత మన దగ్గర ఏమీ ఉండదు. అలా ఈ మధుర వైన్స్ సినిమా కొంత కాలం ఆగిపోయింది. 2018 లో షూట్ స్టార్ట్ చేశాము 2019 లోనే ఒక టెక్నీషియన్ దగ్గర ఎనిమిది నెలలు సినిమా ఆగిపోయింది. నేను డైరెక్టర్ అయినా సరే 2019 వరకు ఈ సినిమా అండర్ లో లేదు. సృజన్ గారు వీరంతా వచ్చిన తర్వాత ఈ మూవీ కి ఒక సేపు వచ్చి బయటకు రావడం జరిగింది. అందరూ మా సినిమా కోవిడ్ కారణంగా లేట్ అయ్యింది అంటున్నారు. మా మధుర వైన్స్ కు కోవిడ్ కారణం కాదు, అన్ని అడ్డంకులను దాటుకుని అక్టోబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది” అని అన్నారు.

హీరో సన్నీ నవీన్ మాట్లాడుతూ, “ఇది నా మొదటి చిత్రం ఈ సినిమా ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. షార్ట్ ఫిలిం తీసే నన్ను అందరూ డిస్కరైజ్ చేస్తే మా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయడంతో ఈరోజు నేను ఈ స్టేజి మీద మాట్లాడుతున్నాను. నేను హీరోగా చేస్తున్నాను అంటే దానికి కారణం నాకు షార్ట్ ఫిలిం లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలే, వారందరికీ నా ధన్యవాదాలు. నాకు ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” అని అన్నారు.

మరో నటుడు సమ్మోహిత్ మాట్లాడుతూ, “ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. నాకిలాంటి మంచి చిత్రం లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు