సాంకేతిక సమస్యల కారణంగా ‘పుష్ప’ ట్రైలర్ వాయిదా !

Published on Dec 6, 2021 6:38 pm IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప- ది రైజ్‌’ డిసెంబర్‌ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా తాజాగా ఈ ‘పుష్ప- ది రైజ్‌’ ట్రైలర్ ఈ సాయంత్రం 6:03 గంటలకు విడుదల కావాలి. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నామని
మైత్రీ మూవీస్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. మళ్లీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో చెబుతామని, అప్పటి వరకు స్టే ట్యూన్ అంటూ మైత్రీ మూవీస్ సంస్థ ట్వీట్ చేసింది.

మొత్తానికి బన్నీ ఫ్యాన్స్ ట్రైలర్‌ రిలీజ్ కాగానే వైరల్ చేద్దామని చాలానే ఆశలు పెట్టుకున్నట్టున్నారు. కానీ చివరి నిమిషంలో ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అయింది. మరి ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో చూడాలి. పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమా పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ , సాంగ్స్, టీజర్ ల పై బన్నీ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :