సీనియర్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్ !

సీనియర్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్ !

Published on Nov 1, 2021 12:01 PM IST

బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్‌ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఊర్మిళానే స్వయంగా చెప్పింది. ఊర్మిళా తనకు కరోనా పాజిటివ్ అని పోస్ట్ చేసిన మెసేజ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. నాకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలియజేయదల్చుకున్నాను. నియమ నిబంధనలు పాటిస్తూ నాకు నేనుగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను అని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక ఊర్మిళాతో సన్నిహితంగా ఉన్న మిగిలిన వాళ్లు కూడా క్వారంటైన్ లోకి వెళ్లారు. ఏది ఏమైనా వరుసగా మళ్ళీ కేసులు వస్తుండడంతో.. మిగిలిన మేకర్స్ లో కూడా ఆందోళన మొదలైంది. కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుండటం తో అటు ప్రజలు కూడా ఆందోళన గా ఉన్నారు. మూడో సీజన్ కూడా వస్తే.. షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాల్సి వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు