స్కై ల్యాబ్ చిత్రానికి భారీగా యూ ఎస్ ప్రీమియర్స్!

Published on Nov 23, 2021 5:30 pm IST

సత్యదేవ్ హీరోగా, నిత్యా మీనన్ హీరోయిన్ గా విశ్వక్ ఖండేరావు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం స్కై ల్యాబ్. ఈ చిత్రం ను నిత్యా మీనన్ కంపనీ బైట్ ఫీచర్స్ తో కలిసి నిర్మించడం జరిగింది. ఈ చిత్రం ను వచ్చే నెల డిసెంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం ను యూ ఎస్ లో 130 కి పైగా లోకేషన్స్ లో విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. యూ ఎస్ లో డిసెంబర్ 3 వ తేదీన ప్రీమియర్స్ పడనున్నాయి. సత్యదేవ్ కెరీర్ లో ఇవి అత్యధిక లోకేషన్స్ అని తెలుస్తుంది. కామెడీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, తనికెళ్ళ భరణి, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :