క్రేజీ : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ పై అంతకంతకు అంచనాలు పెంచేస్తున్న మేకర్స్

Published on May 10, 2023 11:42 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ 2012లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందనేది అందరికీ తెలిసిందే. ఇక సరిగ్గా 11 ఏళ్ళ విరామంగా తరువాత ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తోన్న మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది.

ఇక రేపు అనగా మే 11న గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయి 11 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని విడుదల చేయనున్నారు మేకర్స్. ఇక రేపు సాయంత్రం అటు హైదరాబాద్ లోని సంధ్య 70 ఎమ్ ఎమ్ థియేటర్స్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా గ్లింప్స్ ని ప్రదర్శించనున్నారు. అలానే ఇటు యూట్యూబ్ లో సరిగ్గా 4 గం. 59 ని. లకు గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఇక రెండు రోజుల నుండి ఉస్తాద్ గ్లింప్స్ పై పవన్ ఫ్యాన్స్ లో మరింత హైప్ పెంచేలా ఎప్పటికప్పుడు లేటెస్ట్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొద్దిసేపటి క్రితం ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో షూ వేసుకున్న పిక్ ని పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :