పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా బుక్ మై షోలో వరుసగా సాలిడ్ బుకింగ్స్ ని రిజిస్టర్ చేస్తూ వస్తుంది. ఇలా వరుసగా లక్షకి పైగా టికెట్ సేల్స్ ని కొనసాగిస్తూ వచ్చిన ఈ సినిమా ఒక్క బుక్ మై షోలోనే ఇప్పుడు 1 మిలియన్ టికెట్ సేల్స్ ని క్రాస్ చేసేసింది.
దీనితో ఉస్తాద్ పెర్ఫార్మన్స్ బాగానే కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ఈ ఆదివారం కూడా సాలిడ్ బుకింగ్స్ ఈ సినిమాకి కొనసాగుతున్నాయి. మరి ఈ వీకెండ్ రోజున ఎంత నంబర్ టికెట్ సేల్స్ జరుగుతాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
1 MILLION+ TICKETS SOLD on @bookmyshow alone for #UstaadBhagatSingh 💥💥
Going strong in all centres on Sunday 💥
Watch #UstaadBhagatSingh in theatres now!
🎟️ https://t.co/OmD7t4HExU#BlockbusterUBSPOWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @thisisdsp… pic.twitter.com/Sam7ZATm4R
— Mythri Movie Makers (@MythriOfficial) March 22, 2026
