సడెన్ గా తెలుగు యువ సోషల్ మీడియాలో ఒక్క ఊహించని పోస్ట్ కోసం ఊహించని రచ్చ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా దర్శకుడు హరీష్ శంకర్ పొరపాటుగా ఓ రిప్లై ఇవ్వడం చర్చకి దారి తీసింది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించి కావడంతో ఆ పోస్ట్ రిప్లై మరింత కాంట్రవర్సీకి దారి తీసింది.
ఇక ఈ రచ్చపై ఫైనల్ గా దర్శకుడు హరీష్ శంకర్ ఓ క్లారిటీ అందించారు. అధికారికంగా ఓ ప్రెస్ నోట్ వదిలి తాను కావాలని చేసింది కాదు అని, నిన్న ఉదయం నుంచి అనేక పనుల్లో తాను నిమగ్నం అయ్యి ఉన్నాను అని అలా ఉన్న సమయంలోనే సోషల్ మీడియాలో చాలా రిప్లైలు ఇవ్వడం జరిగింది అని తాను తెలిపారు. అలా ఆ పోస్ట్ కి రిప్లై ఇవ్వడం జరిగింది.
వెంటనే నా టీం అలర్ట్ చేయడంతో ఆ పోస్ట్ తొలగించాను అని సూపర్ మహేష్ బాబు గారు అంటే నాకు ఎంతో గౌరవం అని తాను వచ్చే వారణాసి తో అన్ని రికార్డులు బ్రేక్ చేస్తారని నాకు తెలుసు కానీ తన వైపు నుంచి అనుకోని విధంగా పొరపాటు జరిగింది అని అందుకే ఈ అంశంపై క్షమాపణ కోరుతున్నట్టు తనదైన శైలిలో హరీష్ శంకర్ స్పందించారు. దీనితో ఈ చర్చకి తెర పడింది.
