పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలతో పాటుగా ఓ రీజనల్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఆ సినిమానే దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. చాలా ఏళ్ళు తర్వాత చేస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై సాలిడ్ హైప్ నెలకొంది. అలాగే దీనితో పాటుగా సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుంచి తమిళ చిత్రం తేరి కి రీమేక్ అంటూ పెద్ద రచ్చ నడిచిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఇది ఆ సినిమాకి రీమేక్ కాదు అని ఈ సినిమాకి రచయితగా వర్క్ చేస్తున్న దశరద్ చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. ఆ సినిమా దానికి రీమేక్ కాదు కానీ ఏవో పోలికలు కనిపించి ఉండొచ్చు కానీ రీమేక్ అయితే కాదు అని అంటున్నారు. మరి ఈ సినిమా రీమేక్ కాదు స్ట్రైట్ సినిమా అని హరీష్ శంకర్ అయితే ఇప్పుడు వరకు ఎక్కడా చెప్పలేదు. మరి దీనిపై ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.