అఫీషియల్: ఈ ఓటీటీకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఎవరు సొంతం చేస్కున్నారంటే?

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల అలాగే రాశీ ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”(Ustaad Bhagat Singh). భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సినిమాపై అఫీషియల్ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. మరి ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనున్నట్టు తాజాగా వారు అనౌన్స్ చేశారు.

నెట్ ఫ్లిక్స్ పండుగ పేరిట తెలుగు సినిమాల లిస్ట్ నేడు అనౌన్స్ చేస్తుండగా మొదటి సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ ని అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా మొత్తం పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకుని రానున్నారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫ్యాన్స్ కి ఇదొక బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే

Exit mobile version