“ఉస్తాద్ భగత్ సింగ్” పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

Published on Mar 10, 2023 2:11 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆల్రెడీ పలు సినిమాలు ఓకే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలను పవన్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తుండడం విశేషం. గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మరియు హరిహర వీరమల్లు సినిమాలకి ఏక కాలంలో ఎలా పాల్గొన్నాడో ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాల్లో పవన్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాల్లో మాస్ ఎంటర్టైనెర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి.

దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ చేస్తున్న రెండో సినిమా ఇది కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాపై లేటెస్ట్ గా మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. ప్రస్తుతం దర్శకుడు మరియు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి లు ఓ భారీ సెట్ వర్క్ పై ఉన్నారని వారితో పాటుగా సినిమాటోగ్రాఫర్ బోస్ కూడా సినిమాని ఫీస్ట్ లా ప్లాన్ చేస్తున్నారని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని అందించారు. అలాగే షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం :