“ఉస్తాద్ భగత్ సింగ్” రూమర్స్ కి చెక్ చెప్పినట్టేగా!

“ఉస్తాద్ భగత్ సింగ్” రూమర్స్ కి చెక్ చెప్పినట్టేగా!

Published on Jun 12, 2024 9:31 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ రేంజ్ లో హై లో ఇపుడు ఉన్నారని తెలిసిందే. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ సాధించిన అఖండ విజయం తన ప్రమాణ స్వీకారాలతో వారికి ఇప్పుడు అమితానందగా ఉంది. అయితే ఈ హ్యాపీ మూమెంట్ లో పవన్ నటిస్తున్న సినిమాల తాలూకా అప్డేట్స్ కూడా అభిమానులకి మేకర్స్ అందించారు. పవన్ ఇప్పుడు రాజకీయాల్లో మరింత బిజీ అయిపోతాడు అని ఇక ఆల్రెడీ స్టార్ట్ చేసిన సినిమాలు వదిలేసినట్టే అని కొన్ని పుకార్లు కొందరు స్ప్రెడ్ చేశారు.

మెయిన్ గా తక్కువ శాతం పూర్తయిన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా నిలిచిపోయింది అన్నట్టు కొన్ని ఫేక్ ప్రచారాలు జరిగాయి. అయితే వీటికి చెక్ పెడుతూ మేకర్స్ పవన్ పై సాలిడ్ పోస్టర్ ని రిలీజ్ చేసి సినిమా ఆన్ లోనే ఉందని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల నటిస్తుండగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు