‘ఉస్తాద్ భగత్ సింగ్’ : కీలక రోల్ లో కనిపించనున్న సీనియర్ నటి ?

Published on Sep 16, 2023 1:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు కలిగిన ఈ క్రేజీ కాంబో మూవీలో శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా ఇందులో కీలక పాత్రలో సీనియర్ నటి గౌతమి నటిస్తున్నారు. కాగా ఇందులో పవన్ కళ్యాణ్ కి తల్లి పాత్రలో ఆమె కనిపించనున్నారట. తమిళ సూపర్ హిట్ మూవీ తేరి కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :