సిజి వర్క్స్ బిజీగా ఉన్న కమల్ ‘ఉత్తమ విలన్’

Uttama-Villain
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న సినిమా ‘ఉత్తమ విలన్’. కమల్ హాసన్ ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సబందించిన సిజి వర్క్ పనులు జరుగుతున్నాయి. కథానుసారం ఈ సినిమాలో ఎక్కువగా సిజి ఎఫెక్ట్స్ కి ఆస్కారం ఉంది. అందుకే ఓ స్పెషల్ టీం స్పెషల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేస్తున్నారు.

ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన లింగుసామి ఉత్తమ విలన్ గురించి మాట్లాడుతూ ‘ఉత్తమ విలన్’ షూటింగ్ పూర్తయ్యింది, ప్రస్తుతం సిజి వర్క్ జరుగుతోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా లేదా సంక్రాంతి తర్వాత రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నామని’ తెలిపాడు. యువ సంచనలనం జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఉత్తమ విలన్ ఆడియో రైట్స్ ని ఎరోస్ వారు ఫ్యాన్సీ అమౌంట్ కి సొంతం చేసుకున్నారు. కమల్ హాసన్ ఇందులో మలయాళంలో ఫేమస్ అయిన తెయ్యమ్‌ కళాకారుడిగా, మరొకటి సినిమా నటుడిగా కమల్‌ హాసన్‌ కనిపిస్తాడు.

రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కె. బాలచందర్, పూజ కుమార్, ఆండ్రియా, పార్వతి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ – రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. ఇది కాకుండా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’, ‘పాపనాశనం’ సినిమాలు కూడా త్వరలో విడుదలకు కానుంది.

Exit mobile version