ప్రముఖ నటుడు భార్య మృతి !

Published on Sep 13, 2021 10:09 am IST

ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ సతీమణి పద్మావతి మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్ మహమ్మారితో బాధ పడుతున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పద్మావతి ఈ రోజు కన్ను మూశారు. తన భార్య మరణం పట్ల స్పందిస్తూ ఉత్తేజ్ ఎమోషనల్ అయ్యారు.

పద్మావతి మృతి పట్ల టాలీవుడ్‌ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. ‘123తెలుగు.కామ్’ నుండి పద్మావతి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము. పద్మావతి దహన సంస్కారాలు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగనున్నాయి.

సంబంధిత సమాచారం :