యూటర్న్ లేటెస్ట్ కలక్షన్స్ !

అగ్ర హీరోయిన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో పవన్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘యూటర్న్’. సెప్టెంబర్ 13న విడుదలైనా ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 23కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏ సెంటర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈచిత్రం విజయం తో సమంత ఈ ఏడాది వరుసగా నాల్గవ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

కన్నడలో విజయం సాధించిన ‘యూటర్న్’ చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో భూమిక, ఆది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం తరువాత సమంత మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Exit mobile version